కేన్సర్ బారిన పడ్డ భార్యను బతికించుకోవడం కోసం భిక్షమెత్తుతున్న 75 ఏళ్ల భర్త

అపురూపమైనదమ్మా ఆడజన్మ… ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ… అనే పాట మహిళ విలువను తెలియజేస్తుంది. ఆడవారి గొప్పతనాన్ని వివరిస్తుంది. ఒక మహిళ బిడ్డగా, భార్యగా, తల్లిగా, అక్క చెల్లిగా ఎన్నో రూపాలుగా కనిపిస్తుంటుంది. తన కుటుంబానికి ఆపద వస్తే తల్లడిల్లుతుంది. అటువంటి మహిళకే ప్రాణాంతక వ్యాధి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. ఆన్యోన్యంగా ఉంటున్న ఆ వృద్ద దంపతులకు విషాదకరమైన వార్త తెలిసింది. భార్యకు గర్భాశయ క్యాన్సర్ అని. దీంతో ఆమెను బ్రతికించుకోవడానికి ఆ భర్త పడుతున్న బాధ మామూలుది కాదు. 75 ఏళ్ల పండు ముసలితనంలో కూడా తన భార్యను బతికించుకోవడానికి వయోలిన్ వాయిస్తూ భిక్షమెత్తుకుంటున్నాడు. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తా కు చెందిన స్వపన్ సేఠ్ తన భార్య పూర్ణిమ. పూర్ణిమ 2002 లో గర్భాశయ కేన్సర్ బారిన పడింది. ఆమెకు వైద్యం చేయించే స్థోమత లేక స్థానికంగా ఉన్న ప్రభుత్వం హాస్పిటల్ లో చికిత్స చేయిస్తూ వస్తున్నాడు. కేన్సర్ వైద్యం ఖరీదుతో కూడుకున్నది కావడంతో స్వపన్ సేఠ్ కు ఆమెకు చికిత్స చేయించే స్థోమత లేదు. కానీ భార్యను బతికించుకోవాలనే తపన ఉంది. అందుకే ఆమెకు అయ్యే వైద్య ఖర్చులను పోగు చేయాలని నిర్ణయించుకున్నాడు.

తపన్ సేన్ వయోలనలిస్ట్. వయోలిన్ బాగా వాయించగలడు. 75 ఏళ్ల వయసులో తన వయసు భారాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి కూడలిలో వయోలిన్ వాయిస్తూ భిక్షమెత్తుకుంటున్నాడు. తపన్ సేన్ గురించి తెలుసుకున్న వారు కన్నీరుపెట్టుకున్నారు. మరి కొందరు తాము విరాళాలిస్తామని తపన్ సేన్ కు హామీనిచ్చి వివరాలు సేకరించారు. తపన్ సేన్ దేశ వ్యాప్తంగా తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నాడు. భార్య కోసం తపన్ సేన్ పడుతున్న బాధ చూసి అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. తపన్ సేన్ కష్టం ఫలించి భార్య పూర్ణిమ ఆరోగ్యంగా ఉండాలని అంతా కోరుకుంటున్నారు.