హీరో అబ్బాస్ సినిమాలకు దూరమై.. ఏం చేస్తున్నాడో తెలుసా?

అబ్బాస్ ప్రముఖ దక్షిణ భారతదేశ సినీ నటుడు. ఈయన పూర్తి పేరు మీర్జా అబ్బాస్ అలీ. ఈయన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలో నటించాడు. ఈయన 1975లో కొలకత్తా లో జన్మించాడు. ఈయన యరం యరం అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 1996లో తమిళ అనువాద చిత్రం ప్రేమదేశం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు.

ఈ సినిమా ఈయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాతో బాగా పాపులర్ గా ఎదిగాడు. అప్పట్లో ఈయన హెయిర్ స్టైల్ కు బాగా క్రేజ్ ఉండేది. చాలామంది యువకులు అబ్బాస్ కటింగ్ అని హెయిర్ స్టైల్ చేసుకునేవారు. ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఆ తరువాత వరుస అవకాశాలతో ముందుకు దూసుకుపోయాడు. తెలుగు, తమిళ్లో ఈయన కున్న క్రేజ్ ను వివరించడం కష్టం.

మొదటిలోనే సక్సెస్ ఫాలోయింగ్ చూసి స్టార్ గా ఎదుగుతాడని సినీ ఇండస్ట్రీలో చాలామంది అనుకునేవారు. మొదట పాపులరయ్యి తరువాత క్రేజ్ తగ్గే వారి జాబితాలో చేరిపోయారు అబ్బాస్. హీరోగా అవకాశాలు తగ్గడంతో రాజా వంటి సినిమాల్లో సహాయక పాత్రలో కూడా నటించాడు. తమిళంలో బుల్లితెరపై వచ్చే రెండు సీరియల్లలో కూడా నటించినట్లు తెలిసింది.

అడపాదప అవకాశాలతో కెరీర్ను ముందుకు సాగిస్తున్న కూడా సక్సెస్ అనుకున్న రీతిలో ఉండకపోవడంతో 2015 లో తమిళంలో ఒక సినిమా చేసి తరువాత ఇండస్ట్రీలో కొనసాగలేనని భావించి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. ఆ న్యూజిలాండ్ వెళ్లి భార్యతో కలిసి ఉంటూ ఒక ఉద్యోగం చేస్తున్నాడు.మోటివేషనల్ జాబ్ చేస్తూ అక్కడే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక బైక్ రైడ్ అంటే ఈ హీరోకు ఎంతో ఇష్టం. అప్పుడప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.