కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేసి ఆ పథకాల ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనాలు చేకూరేలా చేసింది. కేంద్రం అమలు చేస్తున్న పొదుపు పథకాలలో సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పథకం ఒకటి కాగా రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా చేయూత కోరుకునే వారికి ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
కేంద్రం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలలో ఈ స్కీమ్ కు ఎక్కువ వడ్డీ రేటు లభిస్తోంది. ఈ స్కీమ్ వడ్డీ రేటు 8 శాతానికి పైగా ఉండగా ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేటు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఈ నిధులు వారికి ఆర్థికంగా చేయూత అందిస్తాయి. ఈ స్కీమ్ లో 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు 20 వేల రూపాయల చొప్పున అందుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ పెద్దగా రిస్క్ లేని పథకం కాగా గ్యారెంటీ రిటర్న్స్ పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. ప్రముఖ బ్యాంకుల్లో డిపాజిట్ల కంటే ఇందులో ఎక్కువ వడ్డీ లభించే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఈ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. సమీపంలోని బ్యాంక్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
మనలో చాలామంది డబ్బుల విషయంలో రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో ఎక్కువ వడ్డీ లభిస్తుండటంతో దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం ఈ స్కీమ్ ద్వారా ఆదాయంగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.