నిరుద్యోగులకు ఎస్బిఐ గుడ్ న్యూస్.. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..?

sbi-agencies

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఎన్నో స్కీమ్స్ ని అందుబాటులోకి తీసుకోవచ్చి సేవలు అందిస్తోంది. తాజాగా నిరుద్యోగులకు కూడా ఎస్బిఐ ఒక శుభవార్త తెలియజేసింది. ఎస్బిఐలో వివిధ బ్రాంచ్లలో ఖాళీగా ఉన్న పలు పోస్టులని భర్తీ చేయటానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఎస్బిఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు అర్హతల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాల్సి వుంది. మార్చి 15, 2023వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువు. ఇక అర్హత వివరాలని చూస్తే… మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్‌) పోస్టులకు ఎంబీఏ (మార్కెటింగ్), పీజీడీఎం/ పీజీపీఎం (మార్కెటింగ్) పూర్తి చేసి ఉండాలి. అలాగే గతంలో పని చేసిన అనుభవం తప్పక ఉండాలి. ఫ్యాకల్టీ (ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్) పోస్టులకు అయితే ఏదైనా స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉండాలి. అలానే అనుభవం కూడా ఉండాలి.

ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని అభ్యర్థుల వయస్సు విషయానికి వస్తే… డిసెంబర్ 31, 2022 నాటికి 28 నుంచి 55 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రూ.750 అప్లికేషన్‌ ఫీజు కింద పే చెయ్యాల్సి వుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. ఈ ఉద్యోగాల బట్టి కోసం షార్ట్‌ లిస్టింగ్ కమ్ ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అయితే ఎంపికైన అభ్యర్థులు ముంబయి, ఎస్‌బీఐఎల్‌, కోల్‌కతా లో పని చేయవల్సి ఉంటుంది. పూర్తి వివరాలని స్టేట్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ లో చూసి అప్లై చేసుకోవచ్చు.