లైంగిక వేధింపుల కేసులో ప్రధాన న్యాయమూర్తికి వూరట

లైంగిక వేధింపుల కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కు వూరట లభించింది.

ప్రధాన న్యాయమూర్తి ఇంటి వద్ద కార్యాలయంలో పని చేస్తున్నపుడు ఆయన తనని లైంగికంగా వేధించాడని చేసిన కోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు చేసిన  ఫిర్యాదు మీద విచారించేందుకు వేసిన ఇన్ హౌస్ (అంతర్గత) కమిటీ  ఈఫిర్యాదులో పసలేదని పేర్కొంది.

ఈ కమిటీకి జస్టిస్ ఎస్ ఎబాబ్డే నాయకత్వం వహించారు.

ఈ కమిటీ మహిళాఉద్యోగి ఆరోపణలను కొట్టివేసింది. అయితే, ఇది ఎక్స్ పార్టీ నిర్ణయం. కమిటీ ఏర్పాటు,పనితీరు సరిగ్గా లేదని ఆమె విచారణను బహిష్కరించారు. అయినా సరేకమిటీ విచారణ కొనసాగించింది.పూర్తి చేసింది. నివేదిక సమర్పించింది. నివేదిక ప్రధాన న్యాయమూర్తి నిర్దోషి అని తేల్చింది.

ఈమేరకు సుప్రీంకోర్టు ఒక ప్రకటన విడుదల చేసింది.

‘19.4.219న సుప్రీమ్ కోర్టు మాజీ ఉద్యోగి ఒకరు చేసిన ఆరోపణలలో ఎలాంటి పస లేదని ఇన్ హౌస్ కమిటీ కనుగొనింది. ఇక్కడ ఇందిరా జైసింగ్ వర్సెస్ సుప్రీంకోర్టు , మరొకరు 5 ఎస్ ఎస్ సి 494 గుర్తంచుకోవాలి. ఈ కేసు ప్రకారం కోర్టు నియమించిన ఇన్ హౌస్ కమిటీ నివేదికను బహిర్గతం చేయరాదు,’ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

బుధవారం నాడు జస్టిస్ గొగొయ్ కూడా ఈ కమిటీ ముందు హాజరయ్యారు. ఫిర్యాదు చేసిన మహిళ గొగొయ్ క్యాంప్ ఆఫీస్ లో జ్యడిషియల్ అసిస్టెంటుగా పనిచేశారు. ఆమె తన పట్ల ప్రధాన న్యాయమూర్తి అసభ్యప్రవర్తించారని ఒక ప్రమాణ పత్రంతో ఫిర్యాదు కోర్టు న్యాయమూర్తులందరికి పంపించారు.దీనిని దేశంలోని ప్రముఖ వెబ్ సైట్లన్నీప్రచురించి కేసును వెలుగులోకి తీసుకువచ్చాయి. దీని పర్యవసానమే ఈ విచారణ.

ఫిర్యాదుచేసిన మహిళ ఈ విచారణకు హాజరుకాలేదు. కమిటీలో మెజారిటీ మహిళలు ఉండాలని, తనతో పాటు తన న్యాయవాదిని కూడా అనుమతించాలని  కోరారు. దీనికి అంగీకరించనందున ఆమె విచారణకు హాజరుకాలేదు. ఫిర్యాదు దారు లేకుండా విచారణ జరగడం మంచిదికాదని,  ఫిర్యాదు చేసిన మహిళను విచారించుకండా ఎక్స్ పార్టీ నివేదికను తయారుచేయడం మంచిది కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కమిటీకి లేఖరాసినట్లు మిడియా రాసింది. అంతేకాదు, కొన్ని పత్రికల్లో న్యాయమూర్తులు చంద్రచూడ్ , నారిమన్ జస్టిస్ బాబ్డే కలిసినట్లు కూడా వార్తలొచ్చాయి.  ఈ వార్తలను సుప్రీంకోర్టు ఒక ప్రకటనలో ఖండించింది.

మొత్తానికి కమిటీ పనితీరు తొలినుంచి సజావుగా సాగనేలేదని చెప్పాలి. మొదట కమిటీలో జస్టిస్ ఎన్ రమణ కమిటీ నుంచి వైదొలిగారు. జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాగా దగ్గిర వారని, వారి కుటుంబంలో వ్యక్తిగా మెలుగుతుంటారని చెబుతూ ఆయన కమిటీలో ఉంటే  న్యాయం జరగదని ఆమె అభిప్రాయపడ్డారు.దీనితో  జస్టిస్ రమణ కమిటీ నుంచి వైదొలగారు. కమిటీలో ఒకే మహిళసభ్యురాలిగా ఉండటాన్ని కూడాఆమె వ్యతిరేకించారు. తర్వాత మరొక మహిళా సభ్యురాలినిచేర్చారు. జస్టిస్ బాబ్డే తో పాటు కమిటీలో  న్యాయమూర్తులు ఇందు మల్హోత్రా, ఇందిరా బెనర్జీ సభ్యులుగా ఉన్నారు.

సోమవారం నాడు బార్ అండ్ బెంచ్ ప్రచరించిన  సుప్రీం కోర్టు ప్రెస్ నోట్ ఇది