రేపు ఉదయం సుప్రీంకోర్టు లో ఏంజరుగుతుందో చూడండి…

రేపు సుప్రీంకోర్టు ముందుకు ఒక ఆసక్తికరమయిన విషయం పరిశీలనకు రాబోతున్నది.

  భారత  ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ రంజన్ గొగోయ్  మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల మీద  ఉత్సవ్ సింగ్ బైన్స్ అనే న్యాయవాది చేసిన వ్యాఖ్యాలను కోర్టు పరిగణనలోనికి తీసుకుంది.

లైంగిక వేధింపుల ఫిర్యాదు ను సాకుగా తీసుకుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ చేత రాజీనామా చేయించే కుట్ర జరగబోతున్నదని ఉత్సవ్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు.

ఇందులో భాగస్వామి కావాలని తనను కోరారని, లైంగిక వేధింపుల ఫిర్యాదుచేసిన సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి తరఫున వాదించి ప్రెస్ క్లబ్ లో ఆమె చేత ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయిస్తే కోటిన్నర రుపాయల లంచం ఇస్తామని ఆశచూపారని కూడా ఆయన పేర్కొన్నారు.

ఈవిషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఒక ముగ్గురు సభ్యలు ధర్మాసనం ఉత్సవ్ కు నోటీసులు పంపించింది. తాను చేసిన వ్యాఖ్యల మీద స్పందించాలని కోర్టు ఆయన నోటీసు పంపింది.

ఈ ధర్మాసనానికి అరుణ్ మిశ్రా నాయకత్వం వహిస్తున్నారు. జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తా సభ్యులుగా ఉన్నారు. ఇది చాలా‘ న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్నా ఒక ముఖ్యమయిన ప్రజా ప్రయోజన వ్యవహారం’ (A matter of great public importance touching upon the independence of judiciary) అని ఈ వ్యాజ్యాన్ని వర్ణించింది.

రేపు ఉదయం పదిన్నరకు తాము ఆయన స్పందనను వింటామని కోర్టు సమయం కూడా నిర్ణయించింది.
ఉత్సవ్ సోమవారం నాడు కోర్టులో ఒక అపిడవిట్ కూడా పైల్ చేశారు.

ప్రధానన్యాయమూర్తి రంజన్ గొగోయ్ మీదవచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో గుర్తు తెలియని ఆగంతకుడు తననుకలిశారని చెబుతూ గొగోయ్ మీద ప్రెస్ క్లబ్ లో ఒక విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి, ఆమెతరఫున కోర్టు లో వాదిస్తే కోటిన్నరుపాయల లంచం ఇస్తానని చెప్పాడని ఉత్సవ్ తెలిపారు.
ఈ విషయాన్ని ఆయన తన ఫేస్ బుక్ అకౌంట్ మీద పోస్టు చేశారు.

జస్టిస్ గొగోయ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన కొన్ని గంటల్లోనే ఉత్సవ్ ఫేస్ బుక్ లో ఈ విషయాన్ని పోస్టు చేశారు. వచ్చిన వ్యక్తి బాధితురాలి బంధువునని చెప్పుకున్నాడని, అయితే, తాను లంచం తీసుకునేందుకు నికారించానని ఉత్సవ్ చెప్పారు.


ఇలాంటి వేధింపుల కేసును ఎదుర్కొంటున్న ఆశారామ్ బాపు కేసును వాదించి ఉత్సవ్ వార్తల్లోకెక్కాడు.
తాను ఆశారాం బాపు కేసులో వాదించినతీరు చూసి సంతృప్తి చెందానని, అందుకే తనని సంప్రదిస్తున్నట్లు చెప్పారని ఉత్సవ్ తెలిపారు. పైకి తాను బాధితురాలి బంధువని చెప్పుకునా, వచ్చిన ఆగంతకుడు బాగా అనుభవం వున్న బ్రోకర్ లాగా కనిపించాడని ఆయన చెప్పారు.

బాధితురాలి కథనంలో చాలా లొసుగులుండటం, అందులో వాస్తవం ఉన్నట్లు కనిపించడం లేదని అందుకే తాను ఆ కేసును స్వీకరించేందుకు నిరాకరించానని ఉత్సవ్ చెప్పారు.

ప్రధాన న్యాయమూర్తి మీద వచ్చిన ఆరోపణలను తన స్థాయిలో తాను విచారించిన తర్వాత దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందని పించిందని ఆయన చెప్పారు.