రు.2 వేల నోట్ల రుపాయలను తగ్గించేస్తున్నారు…

భారతీయ రిజర్వు బ్యాంకు  రెండు వేల రుపాయల నోట్ లను ముద్రించడం కుదించేస్తున్నది. చివరకు ఇవి కేవలం నామమాత్రంగా ముద్రించాలని రిజర్వు బ్యాంక్ భావిస్తున్నది. మెల్లిగా అవి కనిపించకుండా పోవచ్చు. రు. 500.రు 1000 నోట్ల రద్దు కు  పూనుకున్నపుడు రీమానెటైజేషన్ కోసమని అంతకంటే పెద్ద నోటైన రు. 2000 నోట్ ను ముద్రించేశారు.

పెద్ద నోట్లను రద్దు చేసేందుకు నోట్ల రద్దు చేపట్టి అంతకంటే  ఇంకా పెద్ద నోట్ ను విడుదల చేయడం చాలా విమర్శలకు దారి తీసింది. ఈ నోట్ వల్ల వినియోగదారులకు మార్కట్లో విపరీతంగా సమస్యలెదురయ్యాయి.అందుకే ఇది తుగ్లక్ చర్య అనే విమర్శలొచ్చాయి. అప్పటి నుంచి  ప్రభుత్వం రెండువేల నోట్ల ను రద్దు చేస్తున్నదనే వార్త లొస్తూనే ఉన్నాయి. అయితే,  ఇపుడు రెండు వేల నోట్ల మీద ప్రభుత్వం దగ్గిర నుంచి  అసలు వార్త విడుదలయింది. ఇక ముందు ఈ నోట్ల ముద్రణను బాగా తగ్గించి నామమాత్రం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెండు వేల రుపాయల నోట ముద్రణను తగ్గించేసింది రిజర్వు బ్యాంకు.

‘ రెండు వేల నోట్ల ముద్రణను బాగా తగ్గింది.నిజమే. ఇందులో విశేషమేమీలేదు,’ అని రిజర్వు  బ్యాంకు అధికారులు అంటున్నారు.

రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం, 2017 నాటికి 3,285 మిలియన్ల రెండు వేల రుపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. ప్రింటు తగ్గించడంతో 2018  మార్చి నాటికి కేవలం నామమాత్రం పెరిగాయి.

2018 మార్చినాటికి  దేశం మొత్తంగా సర్క్యు లేషన్ లో ఉన్న అన్ని  రకాల నోట్లు 18,037 బిలియన్లు. ఇందులో  2017 మార్చి నాటికి 50.2  శాతం రెండు వేల నోట్లే ఉండేవి. ఇవి 2018 మార్చి నాటికి 37.3 శాతానికి తగ్గాయి.  2016లో డిమానెటైజేషన్ చేపట్టే నాటికి 500,1000 నోట్లే  86 శాతం దాకా ఉండేవి.