చిన్నారిపై అత్యాచారం… సమాజం సిగ్గుతో తలదించుకునేలా శిక్ష వేసిన గ్రామస్తులు?

దేశంలో రోజు ఏదో ఒక చోట చిన్నారులు స్త్రీలు ముసలి వారు అనే తేడా లేకుండా మహిళలపై అత్యాచారం జరుగుతూనే ఉంది. ఇలా కొన్నిచోట్ల మహిళలపై అత్యాచారానికి ఒడి కట్టిన వారికి కోర్టు పోలీసులు పెద్ద శిక్షలు విధించగా మరికొన్ని చోట్ల మాత్రం ఇలాంటి సంఘటనలను చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన బీహార్లో ఒకటి చోటుచేసుకుంది అయితే ఇక్కడ నిందితుడికి వేసిన శిక్ష తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు సిగ్గుతో తలదించుకుంటారు.

బిహార్ నవాదా గ్రామంలో కోళ్లఫారం నిర్వహిస్తున్న అరుణ్ పండిట్ అనే వ్యక్తి ఐదేళ్ల చిన్నారిని చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి తన పౌల్ట్రీ ఫారం తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఆ చిన్నారి తల్లిదండ్రులకు చెప్పగా తల్లిదండ్రులు తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కోసం బయలుదేరుతున్న క్రమంలో అరుణ్ పండిట్ ఈ విషయాన్ని గ్రామ పెద్దల సమక్షంలో తేల్చుకోవాలని చెప్పారు. ఈ క్రమంలోనే గ్రామ పెద్దలు సభ నిర్వహించి ఈ విషయం గురించి పంచాయతీ నిర్వహించారు.

ఈ క్రమంలోనే గ్రామ పెద్దలు అరుణ్ పండిట్ తనపై అత్యాచారం చేయలేదని భావించి కేవలం నిందితుడికి ఐదు గుంజీలను శిక్షగా విధించారు.తాను చిన్నారిపై అత్యాచారం చేయలేదని కేవలం తనని ఒంటరిగా పౌల్ట్రీ ఫారం తీసుకువెళ్లినందుకే తనకు ఐదు గుంజీలు శిక్షగా విధించినట్లు గ్రామ పెద్దలు తీర్పు ఇవ్వడంతో ఒక్కసారిగా చిన్నారి తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురై తమ చిన్నారికి న్యాయం జరగలేదని లబోదిబోమన్నారు.ఇలా చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి ఐదు గుంజీలు శిక్ష విధించడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున ఈ సంఘటనపై స్పందించినటువంటి ఎంతో మంది నిందితుడికి కఠినంగా శిక్ష పడాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.