భారత వైమానిక దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోకి చొరబడి అక్కడి తీవ్రవాదస్థావరాల మీద జరిపిన దాడుల (సర్జికల్ స్ట్రయిక్స్) గురించి ప్రధాని నరేంద్రమోదీ చెప్పని రోజంటూ ఉంటదు.
దాన్నొక ఘనవిజయంగా భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకుంటూ వస్తున్నది. అయితే, సర్జికల్ స్ట్రయిక్స్ కొత్త కాదని అవిఎపుడూ కొనసాగుతున్నవే అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెబుతూ వస్తున్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ ను రాజకీయ చేయవద్దనికూడా అంటూ వస్తున్నారు.
ఇపుడు సర్జికల్ స్ట్రయిక్స్ ప్రచారం మీద రాహుల్ గాంధీ పెద్ద దెబ్బ వేశారు. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ హీరోని తన వైపు తిప్పుకోవడం లో కాంగ్రెస్ పార్టీ విజయవంతమయింది. సర్జికల్ స్ట్రయిక్స్ కు పథకం వేసి నడిపించి, విజయవంతం చేశారని పేరున్న లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డు) దీపేందర్ సింగ్ హూడాను కాంగ్రెస్ పార్టీ సెక్యూరిటీ అడ్వయిజర్ నియమించింది. తాను కాంగ్రెస్ పార్టీ లో చేరడంలేదని, పార్టీ కోసం ఒక విజన్ డాక్యుమెంట్ ను మాత్రం తయారు చేస్తానని హూడా అన్నారు.
పాక్ అక్రమిత కాశ్మీర్ లో సర్జికల్ స్ట్రయిక్స్ ను అమలుచేసేందుకు ఏర్పాటుచేసిన టాక్స్ ఫోర్స్ చీఫ్ గా హూడా పనిచేశారు. ఆయన ఇండియన్ ఆర్మీ నార్తర్న్ కమాండ్ చీఫ్ గా ఉన్నారు. ఆయన నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నారు. పార్టీ ఏర్పాటుచేస్తున్న నేషనల్ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్ కు నాయకత్వం వహించాలని రాహుల్ ఆయనని కోరారు. ‘ కాంగ్రెస్ అధ్యక్షుడు నేషనల్ సెక్యూరిటీ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారు.దేశ భద్రతకు సంబంధించిన ఒక విజన్ డాక్యుమెంట్ ను తయారుచేయడం ఈ టాస్క్ బాధ్యత. ఈ రంగంలో నిపుణులందిరితో సంప్రదించి విజన్ డాక్యుమెంట్ ను లెఫ్టినెంట్ జనరల్ (రి) డిఎస్ హూడా తయారు చేస్తారు,’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
సర్జికల్ స్ట్రయిక్స్ ను రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోవడానికి లె.జ. (రి)హూడా వ్యతిరేకం. ఈ దాడుల మీద అంత ప్రచారం పనికిరాదనేది ఆయన అభిప్రాయం.
ఈ మధ్యఆయన టైమ్స్ ఆప్ ఇండియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సంచలనం సృష్టంచింది. ‘‘గత మూడు నాలుగు సంవత్సరాలలో కాశ్మీరీ యువకులు టెర్రిరిస్టులలో చేరడం ఎక్కువయింది. భద్రతా దళాల మీద దాడులు ఎక్కువయ్యాయి.గత పదేళ్లలో టెర్రరిస్టుల చేతుల్లో ఎక్కువ మంది భద్రతా దళాలు హతమయింది 2018లోనే. అంటే, మన లో ఎదో ప్రాబ్లమ్ ఉన్నట్లే.’’ : డిఎస్ హూడా ఆ ఇంటర్వ్యూ లో చెప్పారు.