రెండు యుద్ధ విమానాలను కోల్పోయిన భారత్

రెండు భారతీయ యుద్ధ విమానాలు కూలిపోయాయి.ఇందులో ఒకటి జమ్ము కాశ్మీర్ బద్గామ్ జిల్లాలో పడిపోతే, రెండోది ఎల్ వొసి (LOC)కి అవతలి వైపు పడిపోయింది.

దీని పైలట్ ను తాము నిర్బంధంలోకి తీసుకున్నామని పాకిస్తాన్ ప్రకటిస్తూ ఉంది. అసలు ఈ జెట్ యుద్ధ విమానాలను కూల్చింది తామే నని కూడా పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. ఈ ఉదయం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడులకు స్పందిస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ ఎల్ వొసి దాటి వచ్చాయని వాటిని కూల్చేయడం జరిగిందని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటిచింది.

భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను పాకిస్తాన్ గగన తలంలో కూల్చేయడం జరిగింది. ఇందులో ఒకటి ఆజాద్ కాశ్మీర్ (పాక్ అక్రమిత కాశ్మీర్) లో పడిపోయింది. ఒక పైలట్ ను సైనికులు అరెస్టు చేశారు,’ పాక్ ట్వీట్ చేసింది.

 

 

ఇది కూడా చదవండి

భారత్ పాక్ ల మధ్య ఉద్రికత్త, డొమెస్టిక్ విమాన సర్వీసులు బంద్