బండి సంజయ్.. కరీంనగర్ ఎంపీ.. మాంచి స్ట్రాంగ్ రాజకీయ నాయకుడే. ఎవ్వర్నయినా తన మాటలతో పడేయగలడు. అంతటి వాగ్దాటి. కానీ.. ఈమధ్య కొన్నిసార్లు మాటలు కోటలు దాటుతున్నాయి. నిజానికి దుబ్బాకలో బీజేపీ గెలిచాక.. బీజేపీ నేతల వ్యాఖ్యలు హద్దు మీరుతున్నాయి.
అంతకుముందు చాలాసార్లు నోరుజారిన బండి సంజయ్.. మరోసారి నోరుజారాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ పాతబస్తీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్ వాసులు ఓట్లేస్తున్నారంటూ బండి సంజయ్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామంటూ బండి సంజయ్ స్పష్టం చేశారు.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఎప్పుడో ఖాయం అయిపోయింది. బీజేపీ గెలుపును ఆపడం కోసం టీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కయ్యాయి. వీళ్ల ఆటలు ఇక సాగవు… అంటూ రామంతాపూర్, ఉప్పల్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పై వ్యాఖ్యలు చేశారు.
అయితే.. బండి సంజయ్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.