శృంగార తార సన్నీ లియోన్ గురించి ఇండియాలో తెలియని వారు ఉండరు. ఆమె వస్తుందంటే జనాలు ఎగబడి చూస్తారు. కేరళలో సన్నీలియోన్ గతంలో ఒకసారి అడుగు పెట్టిన సమయంలో ఇసుక వేస్తే రాలనంత జనం ఆమెను చూడడానికి వచ్చారు. ఆ ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి పోలీసుల వొల్లు హూనమైంది.
మరి అటువంటి సన్నీలియోన్ నవంబరులో బెంగుళూరు రాబోతున్నది. కేరళ అనుభవం నేపథ్యమో ఇంకే కారణమో తెలియదు కానీ సన్నీ లియోన్ రావొద్దంటూ ఒక యువసేన నిరసన కార్యక్రమాలకు దిగింది. సన్నీ బెంగళూరు రాకను నిరసిస్తూ బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదిక యువసేన ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.
వీరమహాదేవి సినిమాలో సన్నీ లియోన్ నటించిన పాత్ర అసభ్యంగా ఉందని వారు నిరసన తెలిపారు. కర్ణాటక రాష్ట్రకూట పాత్రలో సన్నీ లియోన్ ను చూపించారని దీనిని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రైవేటు ఈవెంటులో పాల్గొనడానికి సన్నీ లియోన్ నవంబర్ 3న బెంగళూరు వస్తుంది. ఆమె బెంగళూరుకు రావద్దని వారు నిరసన తెలిపారు.
మరికొందరు ఆందోళన కారులు తమ నిరసనను నెత్తుటి నిరసనగా మార్చారు. చేతి మీద కోసుకుని రక్తం చిందించి మరీ నిరసన తెలిపారు. ఈ పరిస్థితుల్లో సన్నీ లియోన్ పర్యటన జరుగుతుందా లేదా అన్నది టెన్షన్ గా మారింది. ఆందోళన కారుల వీడియోలు కింద ఉన్నాయి చూడొచ్చు.