PM Narendra Modi: పంజాబ్ పర్యటనలో ప్రధాని మోదీకి నిరసన సెగ తగిలింది. ఫిరోజ్‌పూర్ సభలో ప్రశంగించేందుకు వెళుతున్న ప్రధానిని ఆందోళన కారులు అడ్డుకున్నారు. 20 నిమిషాల పాటు మోడీ కాన్వాయ్‌ను కదలనివ్వలేదు. దీంతో ప్రధాని తిరిగి ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. అయితే, దీనిపై స్పందించిన పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ ప్రధాని భద్రతా చర్యల్లో ఎలాంటి లోపం లేదని వెల్లడించారు.
ఈ నేపథ్యం లో పంజాబ్ ఫిరోజ్ పూర్ ఫ్లైఓవర్ పై ప్రధాని నరేంద్రమోదీ ఇరవై నిమిషాలపాటు చిక్కుకుపోవడంతో ఒక్కసారిగా భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యింది. చాలా సేపటి వరకు నిరసనకారుల ఆందోళన కొనసాగడంతో.. ప్రధాని మోదీ పర్యటన రద్దు చేసుకుని బరిండా విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఈ సందర్భంలో అక్కడ ఉన్న ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ కి థాంక్స్ చెప్పానని చెప్పండి. నేను విమానాశ్రయానికి ప్రాణాలతో చేరుకోగలిగాను’ అని మోదీ తమతో అన్నారని అధికారులు తెలిపారు.
Officials at Bhatinda Airport tell ANI that PM Modi on his return to Bhatinda airport told officials there,“Apne CM ko thanks kehna, ki mein Bhatinda airport tak zinda laut paaya.” pic.twitter.com/GLBAhBhgL6
— ANI (@ANI) January 5, 2022