కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లలో ఎంతోమంది పిల్లలు తల్లీదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. కరోనా వల్ల తల్లీదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం కేంద్రం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా అనాథలైన పిల్లలకు ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు అందనున్నాయి. 23 సంవత్సరాల వయస్సు వచ్చే సమయానికి పిల్లల చేతికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
మహిళా శిశు మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ ను అమలు చేస్తుండగా 23 సంవత్సరాలు వచ్చే సమయానికి వాళ్లను ఆర్థికంగా సెటిల్ చేయడమే లక్ష్యంగా ఈ స్కీమ్ అమలవుతోంది. https://pmcaresforchildren.in/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తల్లీదండ్రులు మరణించే సమయానికి పిల్లల వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి.
18 ఏళ్లు నిండిన పిల్లలకు నెలసరి స్టైఫండ్, 23 ఏళ్లు వచ్చాక రూ.10 లక్షల ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ ను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్యను కల్పిస్తారు. ఉచితంగా 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు పీఎం కేర్స్ నుంచి ఎడ్యుకేషన్ కోసం రుణాలకు వడ్డీ చెల్లింపు జరుగుతుంది. ఈ స్కీమ్ ద్వారా బుక్స్, యూనిఫాంను కూడా అందివ్వడం జరుగుతుంది.
ఉన్నత విద్య చదవడానికి కూడా ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కరోనా వల్ల అనాథలైన పిల్లలు ఈ స్కీమ్ ద్వారా సులువుగా ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.