కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ట్రైనీ ఇంజనీర్ , ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలుకావడం గమనార్హం.
ఆగష్టు నెల 26వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. bel-india.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బీఈ, బీటెక్ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 472 రూపాయలు కాగా ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 177 రూపాయలుగా ఉంది. bel-india.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. హోం పేజ్ లో కెరీర్ ట్యాబ్ ను ఓపెన్ చేసి సంబంధిత పోస్టు అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫామ్ ను నింపి అవసరమైన డాక్యుమెంట్లను జత చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రింట్ అవుట్ కాపీని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవాలి. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.