అక్కడ టమోటాలు కేవలం 70 రూపాయలు మాత్రమే.. సులువుగా ఎలా ఆర్డర్ చేయాలంటే?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టమాటాల రేట్లు మండిపోతున్నాయి. మదనపల్లి మార్కెట్ లో ఈరోజు టమాటా పండ్లు హైయెస్ట్ గా ఏకంగా 168 రూపాయలకు అమ్ముడయ్యాయి. టమాటా పండ్లకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో సులభంగానే అర్థమవుతుందనే సంగతి తెలిసిందే. అయితే పేటీఎం ద్వారా టమోటాలను సులువుగా కిలో 70 రూపాయల చొప్పున కొనుగోలు చేయవచ్చు. ఒక మనిషి గరిష్టంగా 2 కిలోల వరకు ఈ విధంగా ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంది.

పేటీఎంలో ఉండే ఓఎన్డీసీ అనే ఆప్షన్ ద్వారా టమోటాలను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై టమోటాల భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకోగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం కలగనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరో నెల రోజుల్లో టమాటా ధరలు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దేశంలోని కొన్ని ప్రాంతాలలో కిలో టమాట ఏకంగా 250 రూపాయలు పలుకుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరలకే టమోటాలను పంపిణీ చేస్తుండటం గమనార్హం. గడిచిన 4 రోజులుగా కేంద్రం 70 రూపాయల చొప్పున టమోటాలను పంపిణీ చేస్తుండటం గమనార్హం.

ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా తక్కువ ధరలకే టమోటాలను కొనుగోలు చేయవచ్చు. నిత్యావసర వస్తువులు కావడంతో టమోటాలను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. చిన్నచిన్న ఊర్లలో సైతం తక్కువ ధరకే టమోటాలను విక్రయించేలా కేంద్రం అడుగులు వేయాల్సి ఉంది.