డిజిటల్ ఇండియా కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. తాజాగా ఈ సంస్థ కొత్త రిక్రూట్మెంట్ డ్రైవ్ ను మొదలుపెట్టింది. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేసే దిశగా ఈ సంస్థ అడుగులు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే వాళ్లకు ఈ వార్త శుభవార్త అని చెప్పవచ్చు.
మొత్తం 48 ఖాళీలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఇందులో కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలు 25 ఉండగా సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలు 16, ఇతర ఉద్యోగ ఖాళీలు 7 ఉన్నాయి. www.dic.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను ఆన్ లైన్ లో సబ్మిట్ చేసి ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలలో కొన్ని ఉద్యోగ ఖాళీలకు అనుభవం కచ్చితంగా ఉండాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 55 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఏకంగా 37 లక్షల రూపాయల వరకు వేతనం లభించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకురూతుంది. ఎక్కువ మొత్తం వేతనం లభిస్తుండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ కూడా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.