రైతులకు శుభవార్త.. ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ.3000 పెన్షన్ పొందే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పై కొన్ని విమర్శలు ఉన్నా రైతులకు ప్రయోజనం చేకూరేలా మోదీ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న పథకాలలో పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రైతులు వృద్ధాప్యంలో నెలకు రూ.3000 పెన్షన్ పొందవచ్చు. ఇప్పటికే రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలకు అదనంగా ఈ స్కీమ్ అమలవుతోంది.

40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న రైతులు ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను సులువుగా పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రైతుల వయస్సును బట్టి ఈ స్కీమ్ కు సంబంధించిన ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. పెన్షన్ తీసుకునే రైతు మరణిస్తే జీవిత భాగస్వామి పెన్షన్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. భార్య, భర్త ఇద్దరూ మరణిస్తే నామినీ ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

ఈ స్కీమ్ లో చేరిన రైతులు ఏదైనా రీజన్ వల్ల స్కీమ్ లో కొనసాగడానికి అంగీకరించని పక్షంలో కేంద్రం వడ్డీతో సహా డబ్బులను చెల్లించడం జరుగుతుంది. సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆధార్ కార్ద్, పాస్ బుక్ తో పాటు బ్యాంక్ అకౌంట్ వివరలాను సమర్పించడం ద్వారా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

పేద, మధ్యతరగతి వర్గాల రైతులు ఈ స్కీమ్స్ ద్వారా పూర్తిస్థాయిలో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటివరకు ఈ స్కీమ్ లో చేరని రైతులు వెంటనే ఈ స్కీమ్ లో చేరితే మంచిది. రైతులకు ఈ స్కీమ్స్ అన్ని రకాలుగా బెనిఫిట్స్ ను కలిగిస్తాయని చెప్పవచ్చు