AP: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలలో పింఛన్ పెంపుదల కూడా ఒకటి అయితే ఈయన చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా పెన్షన్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా లబ్ధిదారులకు అందజేశారు.
ఇకపోతే ఎంతోమంది అనర్హులు కూడా పెన్షన్లు అందుకుంటున్నారనే విషయాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు ప్రత్యేక బృందం ద్వారా వికలాంగుల పెన్షన్లను సర్వే చేయించి అనర్హులకు పెన్షన్ కట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పెన్షన్లను పంపిణీ చేసేవారు అయితే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించారు దీంతో సచివాలయ ఉద్యోగులే ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నారు.
అయితే ఉదయం 5 గంటల నుంచి ఈ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎంతోమంది సచివాలయ ఉద్యోగస్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉదయం 5 గంటలకే మహిళలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పెన్షన్లను అందజేయాలంటే ఎంతో ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై పెన్షన్లను ఉదయం 5 గంటలకే పంపిణీ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందజేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు.పింఛను పంపిణీ సక్రమంగా జరగాలన్నదే తన ఆలోచన అని.. ఆ పేరుతో అనవసర నిబంధనలతో ఉద్యోగులను ఇబ్బందిపెట్టాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు.
పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు.. లబ్ధిదారులతో గౌరవంగా, సౌకర్యవంతంగా వ్యవహరించాలని సీఎం ఉద్యోగులకు సూచించారు.
