బిర్యానీ పేరు చెప్పగానే నోట్లో నీళ్లు ఊరుతాయి.ఇలా బిర్యాని ఇష్టపడే వారి సంఖ్య అధికంగా ఉందని చెప్పాలి.ఈ క్రమంలోనే ఎంతోమంది రెస్టారెంట్లకు వెళ్తూ చికెన్ మటన్ బిర్యానీలో తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో పలు రెస్టారెంట్లలో పావురాల బిర్యాని కూడా లభిస్తోంది. కోళ్లు మేకలను పెంచినట్టే పావురాలను కూడా పెంచి వాటి బిరియాని చేసి విక్రయిస్తున్నారు.
మహారాష్ట్ర, ముంబైలోని సియోన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన హరేష్ గగ్‌లానీ అనే 71 ఏళ్ల వ్యక్తి ఆర్మీ నుంచి రిటైడ్ అయ్యాడు. శ్రీ నరోత్తమ్ నివాస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజుల హరీష్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తాను ఉండే అపార్ట్మెంట్ కింద ఓ వ్యక్తి పావురాలను పెంచుతూ సమీపంలో ఉన్నటువంటి హోటల్ కి పావురాలను అమ్ముతున్నారని వాటి ద్వారా బిర్యాని చేస్తున్నారంటూ ఫిర్యాదు ఇచ్చారు. ఇక ఈ ఫిర్యాదు తీసుకున్నటువంటి అధికారులు ఈ విషయంపై విచారణ చేపట్టారు.
పోలీసులు జరిపిన విచారణలో భాగంగా పలు విషయాలను తెలియజేస్తూ అభిషేక్ మార్చి 2022నుంచి మే 2022 మధ్యకాలంలోభారీ స్థాయిలో పావురాలను పెంచి సమీపంలోని రెస్టారెంట్లకు బార్లకు అమ్మినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై అపార్ట్మెంట్ చైర్మన్ తో పాటు సెక్యూరిటీ పై కూడాకేసు నమోదు చేసినప్పటికీ ఇంకా నిందితులను అరెస్టు చేయకపోవడం గమనార్హం.