పుల్వామాలో ఫిబ్రవరి 14 సిఆర్ పిఎప్ కాన్వాయ్ మీద ఉగ్రదాడి జరిపి 47 మంది జవాన్లు బలిగొన్నందుకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటున్నది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది.
సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై బాంబులతో ఈ తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో భీకర దాడి చేసింది. సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్రక్యాంపుల మీద అగ్ని వర్షం కురిపించి ధ్వంసం చేసింది.
12 మిరాజ్-200 జైట్ ఫైటర్స్ ఈ దాడిలో పాల్గొన్నాయి.
భారత్, పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దాడిలో పాల్గొన్న పైలట్లకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శాల్యూట్ చేశారు.
?? I salute the pilots of the IAF. ??
— Rahul Gandhi (@RahulGandhi) February 26, 2019