భారత్ సినిమాల్ని నిషేధించిన పాక్

పాకిస్థాన్ లో భారత సినిమాల విడుదలను, సినిమాలను నిషేధిస్తున్నామని పాక్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి ప్రకటించారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సోమవారం పాక్ లోని ఉగ్ర శిబిరాల పై మెరుపుదాడులు చేపట్టింది. ఈ దాడుల్లో దాదాపు 350 మంది ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. జైషే అధినేత మసూద్ అజార్ బావమరిది కూడా చనిపోయినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో భారత్ సినిమాల్ని నిషేధిస్తున్నట్టు పాక్ సమాచారం మంత్రి ఫవాద్ ట్వీట్ లో పేర్కొన్నారు. మేడిన్ ఇండియా ప్రకటనలను కూడా నిషేధించాలని పాక్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యూలేటరీ అథారిటికి సూచించారు. తక్షణమే ఇది అమలులోకి వస్తుందని  పాక్ మంత్రి అన్నారు. పుల్వామా దాడి జరిగినప్పుడే పాక్ కళాకారులతో కలిసి నటించకూడదని ఇండియా నిర్ణయం తీసుకుంది.