లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డుల ప్రకటన… ఎవరెవరికి అవార్డు వచ్చిందంటే

లాస్ ఏంజెల్స్ లో 91వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతోంది. హాలీవుడ్ ప్రముఖ నటులంతా సందడి చేశారు. ఉదయం 7గంటల నుంచి ఈ పురస్కార ప్రధానోత్సవం ప్రారంభమైంది. బ్లాక్ ఫాంథర్, రోమా చిత్రాలకు అవార్డుల పంట పడింది.

విజేతల వివరాలు…

ఉత్తమ చిత్రం: గ్రీన్‌ బుక్‌

ఉత్తమ దర్శకుడు- ఆల్ఫోన్సో క్వారోన్‌ (రోమా)

ఉత్తమ నటుడు: రామి మలేక్‌ (బొహేమియన్‌ రాప్సోడీ)

ఉత్తమ నటి: ఒలీవియా కోల్మన్‌ (ది ఫేవరేట్‌)

ఉత్తమ సహాయ నటి- రెజీనా కింగ్‌(ఇఫ్‌ బీల్‌ స్ట్రీట్‌ కుడ్‌ టాక్‌)

ఉత్తమ సహాయ నటుడు- మహర్షెలా అలీ (గ్రీన్‌బుక్‌)

ఉత్తమ ఛాయాగ్రాహకుడు- అల్ఫాన్సో కరోన్‌(రోమా)

ఉత్తమ విదేశీ చిత్రం- ‘రోమా’

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ చిత్రం- ‘ఫ్రీ సోలో’

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం: పీరియడ్‌: ది ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ (భారతీయ చిత్రం)

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌- ‘బ్లాక్‌ పాంథర్‌‘

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌- రూత్‌కార్టర్‌(బ్లాక్‌ పాంథర్‌)

ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌- బొహెమియన్‌ రాప్సోడి

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌- ‘స్పైడర్‌ మ్యాన్‌:ఇన్‌ టూ ది స్పైడర్‌ వర్స్‌)