పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్

Surender Reddy to do film with Pawan Kalyan
Surender Reddy to do film with Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకి సైన్ చేస్తూనే ఉన్నారు.  ఇప్పటికే ఆయన పూర్తిచేయాల్సిన సినిమాలు మూడు ఉన్నాయి.  వాటిలో రెండు సెట్స్ మీద ఉండగా ఇంకొకటి త్వరలో మొదలవుతుంది.  ఇవి కాకుండా ఇంకో ఇద్దరు ముగ్గురు నిర్మాతలకి డేట్స్ ఇచ్చారు ఆయన.  వీటిలో ఒక నిర్మాత సురేందర్ రెడ్డిని లాక్ చేసుకునే ప్రయత్నాలో ఉన్నారట.  సురేందర్ రెడ్డి సినిమాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.  కమర్షియల్, యాక్షన్ సినిమాలను బాగా హ్యాండిల్ చేయగలడు. అతనొక్కడే, కిక్, సైరా, ధృవ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి ఆయనకు. ఇప్పుడు అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమా చేస్తున్నారు.  
 
అఖిల్ చిత్రం కంప్లిట్ అవ్వడానికి ఇంకా ఆరేడు నెలల టైమ్ పట్టేలా ఉంది.  ఈలోపు పవన్ కళ్యాణ్ సెట్స్ మీద ఉన్న సినిమాలను ముగించేసి కాస్త ఫ్రీ అవుతారు.  ఆ టైంలోనే సురేందర్ రెడ్డి సినిమా మొదలుకావొచ్చు.  సురేందర్ రెడ్డికి స్టైలిష్ ఫిల్మ్ మేకర్ అనే పేరుంది.  ఇప్పటికే మెగా హీరోల్లో రామ్ చరణ్, చిరంజీవిలను డైరెక్ట్ చేశారు.  పవన్ కళ్యాణ్ లాంటి హీరో దొరికితే ఏ కమర్షియల్ దర్శకుడికైనా మేకింగ్ విషయంలో హద్దులు ఉండవు.  సురేందర్ రెడ్డి భారీ కథతోనే రంగంలోకి దిగుతాడు.  మరి ఆ కథ ఎంత గొప్పగా ఉంటుందో చూడాలి మరి.