రాజమౌళి ఇక్కడితో ఆగిపోవాలని అనుకోవట్లేదు

Rajamouli to do international film
Rajamouli to do international film
‘బాహుబలి’ చిత్రంతో రాజమౌళి క్రేజ్ దేశవ్యాప్తమైంది.ఒకరకంగా ఇండియన్ సినిమాను ప్రపంచం మరోసారి గుర్తించేలా చేసింది రాజమౌళినే. ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమానే. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చేస్తున్నారు.  300 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రం నేషనల్ లెవల్ ప్రాజెక్ట్.  అయితే రాజమౌళి ఈ నేషనల్ లెవల్ సినిమాలతో ఆగిపోవాలని ఆకోవట్లేదు. ఇంకో అడుగు ముందుకేసి అంతర్జాతీయ స్థాయి సినిమా చేయాలని భావిస్తున్నారు.  ఇందుకోసం కావాల్సిన ఏర్పాట్లు కూడ చేసుకుంటున్నారు.  
 
ఈసారి అంతా అంతర్జాతీయ బృందాలే. హీరో హీరోయిన్లు, టెక్నీషియన్లు అంతా హాలీవుడ్ నుండే ఉండబోతున్నారు. కథ కూడ అంతర్జాతీయ స్థాయిలోనే ఉంటుంది. ఇప్పటికే హాలీవుడ్ నిర్మాతలతో ఒప్పందాలు జరిగాయని, త్వరలోనే అధికారికంగా అన్ని సంగతులు బయటకు తెలుస్తాయని అంటున్నారు. ఇక ఈ సినిమాకు కూడ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను ఇవ్వనున్నారట.  ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ముగిసిన వెంటనే రాజమౌళి మహేష్ బాబు సినిమా చేయాల్సి ఉంది.  అది ముగిసిన తర్వాత ఇంటర్నేషనల్ సినిమాను మొదలుపెట్టవచ్చు.