Omicron: కరోనా కొత్త వేరియంట్ చాపకింద నీరులా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం భారత్ ను కూడా కలవరపెడుతుంది. కరోనా కొత్త వేరియంట్ విస్తరించకుండా ప్రభుత్వాలు ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా కొన్ని ఆంక్షలను విధించింది.
ఒమిక్రాన్ కట్టడి కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోంది. సోమవారం నుంచి విద్యాసంస్థలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, పార్కులు మూసి వేస్తున్నట్లు తెలిపింది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు 50% సిబ్బందితోనే కార్యకలాపాలు సాగించాలంది. సమావేశాలు వర్చువల్ గా నిర్వహించుకోవాలని CS HK ద్వివేది ఆదేశాల్లో పేర్కోన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో యాబై శాతం మంది పనిచేయడానికే అనుమతి ఇచ్చారు. ఇక లోకల్ రైళ్లలోనూ యాభై ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చారు. కోల్ కత్తా నుంచి ముంబయి, ఢిల్లీకి పరిమిత సంఖ్యలోనే విమానసర్వీసులు నడుపుతున్నారు. వారానికి ఒకసారి మాత్రమే విమాన సర్వీసులున్నాయి. కరోనా కట్టడికి మరిన్ని కఠినమైన చర్యలు తీసుకుంటామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది.