భారత పైలెట్ అభినందన్ విడుదల పై పాక్ లో కొత్త ట్విస్ట్

మరికొద్ది గంటల్లో భారత కమాండర్ అభినందన్ విడుదలవుతారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో పాక్ కు చెందిన ఓ సామాజిక కార్యకర్త అభినందన్ విడుదల పై ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పాకిస్థాన్ తమ అదుపులో ఉన్న భారత కమాండర్ ను ఎలా విడుదల చేస్తుందంటూ ఆ పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ పిటిషన్ పై కోర్టు ఎలా స్పందిస్తుందనే సందిగ్ధత ఏర్పడింది. ఇప్పటికే అభినందన్ కు స్వాగతం పలికేందుకు వేలాది మంది భారతీయులు వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. ఈ సమయంలో పాక్ లో ఈ ట్విస్ట్ రావడంతో అంతా షాకయ్యారు.

పాక్ పార్లమెంటులో ఈ నిర్ణయం ప్రకటించడం మరియు జెనీవా ఒప్పందం ప్రకారమే పాక్ ప్రభుత్వం నడుచుకోవడంతో కోర్టు ఈ పిటిషన్ ను కొట్టేసే అవకాశం ఉందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.