ఒకేవేదికపై జగన్ – చంద్రబాబు – పవన్!

ఈనెల 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రారంభోత్సవ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రపతి చేతుల మీదుగా పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని సూచిస్తున్నాయి. కాదని మోడీయే రిబ్బన్ కట్ చేస్తామంటే మాత్రం తాము ఆ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తామంటూ 19 పార్టీలు ఉమ్మడిగా ఓ లేఖ విడుదల చేశాయి. అయితే ఈ విషయంలో వైస్ జగన్ ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని ఫిక్సయ్యారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… మిగిలిన పార్టీలకు ఒక సూచన చేశారు!

“పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్య దేవాల‌యం లాంటిది.. అది దేశం యొక్క ఆత్మను ప్రతిభింబిస్తుంది.. అది దేశ ప్రజలకఏ కాదు అన్ని రాజ‌కీయ పార్టీల‌కు చెంద‌న‌ది.. ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజ‌మైన ప్రజాస్వామ్య స్పూర్తి కాదు. విభేదాల‌న్నింటినీ పక్కన పెట్టి.. అన్ని రాజ‌కీయ పార్టీలు పార్లమెంట్ భ‌వ‌న ప్రవేశ కార్యక్రమానికి హాజరు కావాలి” అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక ట్వీట్ చేశారు.

అయితే ఈ కార్యక్రమానికి ఏపీనుంచి టీడీపీ – జనసేన లు కూడా హాజరవుతున్నాయని తెలుస్తుంది! కారణం… కేంద్రంలో బీజేపీని సమర్ధించే విషయంలో ఏపీలో వైసీపీతో పాటు టీడీపీ – జనసేనలు పోటీపడుతున్నాయి. పైగా ఈ సమయంలో జగన్ ట్వీట్ చేశారు. అంటే పరోక్షంగా టీడీపీ – జనసేనలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో ఒకే కార్యక్రమ వేదికపై జగన్ – చంద్రబాబు – పవన్ కల్యాణ్ లు కనిపించబోతున్నారన్నమాట. దీంతో… ఈ వేదికపై మోడీ ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇస్తారు అనేది ఆసక్తిగా మారింది.

ముఖ్యమంత్రి కాబట్టి జగన్ కు అతి ప్రాధాన్యత ఇస్తారా.. లేక, సీనియర్ పొలిటీషియన్ గా చంద్రబాబుకు ఎక్కువ గౌరవం ఇస్తారా.. అదీకాగ, మిత్రపక్ష సభ్యుడు కాబట్టి పవన్ కు విలువిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా… ఫస్ట్ టైం ఒకే వేదికమీద జగన్ – చంద్రబాబు – పవన్ లు కనిపించబోతున్నారనేది ఏపీ జనాల్లో తీవ్ర ఆసక్తిని కలిగిస్తుంది!