భారత్ ‌లో కనిపించిన తోలి మిస్టరీ ‘మోనోలిత్’ … ఎక్కడ కనిపించిందో తెలుసా ?

ఈ ఏడాది మొత్తం ఓ వింత గా అలా గడిచిపోయింది. కరోనా మహమ్మారి, అలాగే మరికొన్ని మహమ్మారులు విజృంభించాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని నెలల నుంచి మిస్టరీ మోనోలిత్ ఏకశిలలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇప్పటి వరకు ఆ మిస్టరీ మోనోలిత్ లు విదేశాలకి మాత్రమే పరిమితం అయ్యాయి.

కానీ, మొదటి సారి ఆ మిస్టరీ మోనోలిత్ మన దేశంలో ప్రత్యక్షమైంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో రాత్రికి రాత్రే కనిపించిన ఈ మోలోలిత్ ఏకశిల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 నగరాల్లో మోనోలిత్‌ ఏకశిల కనిపించింది. ఇప్పుడు మన దేశంలో ప్రత్యక్షం కావడంతో ఏంటి ఈ మిస్టరీ అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అహ్మదాబాద్‌లోని తల్తేజ్‌లోని సింఫనీ ఫారెస్ట్ పార్క్‌లో ఈ మోనోలిత్ ఏకశిల నిర్మాణం కనిపించింది. ఇతర నిర్మాణాలతో సమానంగా కనిపించే ఈ మోనోలిత్ ఏకశిల మూడు వైపులా ఉంటుంది. మెరిసే లోహాపు పలకలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

దీన్ని మిస్టరీ మోనోలిత్ అని పిలుస్తారు. ఈ లోహపు నిర్మాణం భూమిపై నిర్మించినట్లుగా కనిపిస్తోంది. దీని నిర్మాణం కోసం భూమిని తవ్విన ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. అహ్మదాబాద్‌లో మిస్టీరియస్‌ మోనోలిత్‌ గురించి వైరల్‌ కావడంతో ఈ ప్రదేశం కాస్తా పర్యాటక ప్రాంతంగా మారింది. ఫొటోలు, సెల్ఫీలను క్లిక్ మనిపించడానికి ప్రజలు పోటీపడ్డారు.