బంగారం షాపులో పొడిచి చంపి కోటి రూపాయల నగలు దోచుకెళ్లారు (లైవ్ వీడియో)

మహారాష్ట్రలోని కొల్లాపూర్ లో దారుణం జరిగింది. బంగారం కొనడానికి వచ్చి షాపు యజమానిని దారుణంగా పొడిచి చంపి కోటి రూపాయల విలువైన బంగారు నగలను దుండగులు ఎత్తుకెళ్లారు. వీడియో కింద ఉంది చూడండి.

కొల్లాపూర్ లోని మహాలక్ష్మీ జ్యూయలరీ షాపుకు బంగారం కొనేందుకు అని చెప్పి ముగ్గురు వచ్చారు. అందులో ఒకడు బంగారాన్ని చూస్తున్నట్టుగా నటిస్తూ యజామాని ఛాతిలో, మెడ పై కత్తితో పొడిచాడు. అతను కింద పడగానే ఇష్టమొచ్చినట్టు శరీరమంతా పొడిచి పొడిచి చంపాడు. ఆ తర్వాత షాపులో ఉన్న 1 కోటి రూపాయల నగలను దోచుకెళ్లారు. ఈ సంఘటన అంతా సీసీ టివిలో రికార్డయ్యింది. ఇది చూసిన వారు అయ్యో అనుకొని బాధపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.