మెడికల్ స్టోర్ తో సులువుగా లక్షల్లో ఆదాయం పొందే అవకాశం.. కేంద్రం సపోర్ట్ తో?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ స్వయం ఉపాధి పొందాలని భావించే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మోదీ సర్కార్ చౌకగా మెడిసిన్స్ ను అందించడం కోసం దేశమంతటా జన ఔషధి కేంద్రాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ కేంద్రాలకు సంబంధించి అనుమతులు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి కమీషన్ రూపంలో భారీ ఆదాయం పొందవచ్చు.

ప్రధానమంత్రి భారతీయ జనఔషధ పరియోజన పేరుతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. 2024 మార్చి నెల నాటికి 10,000 జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ కేంద్రాలలో 280 సర్జికల్ డివైజ్ లతో పాటు 1759 ఔషధాలు లభిస్తాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన ఔషధాలు తక్కువ ధరకే అందాలనే సదుద్దేశంతో ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం

ఈ స్కీమ్ కింద ప్రభుత్వం నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఐటీ, ఇన్ఫ్రా వసతుల కోసం సపోర్ట్ లభిస్తుంది. మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు ఏర్పాటు చేసే జన్ ఔషధి కేంద్రాలకు కేంద్రం నుంచి ఈ సపోర్ట్ లభించనుంది. ఎక్కువ సంఖ్యలో మందులు అమ్మితే ఈ కేంద్రాల ద్వారా భారీ మొత్తంలో ఆదాయం లభించే ఛాన్స్ అయితే ఉంటుంది. బీఫార్మసీ, డీ ఫార్మసీ చదివిన వాళ్లకు ఈ స్కీమ్ ప్రయోజకరంగా ఉంటుంది.

మందులపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్నవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను సులువుగా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ కేంద్రాల ద్వారా జరిగే విక్రయాలపై ప్రత్యేక ప్రోత్సాహకాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, డాక్టర్, నిరుద్యోగ ఫార్మసిస్ట్ ఈ కేంద్రాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.