పాక్ పై దాడి చేసేటప్పుడు దగ్గరుండి పర్యవేక్షించిన ప్రధాని మోదీ

ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని అమర జవాన్ల సాక్షిగా ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ మాటను నిలబెట్టుకున్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ త్రివిధ దళాలతో సమావేశమయ్యారు. భారత ఆర్మీకి ఆయన పూర్తి స్వేచ్చనిచ్చారు. దీంతో మోదీ ఆదేశాల మేరకు సోమవారం అర్ధరాత్రి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రవేశించిన భారత వైమానిక దళం మెరుపు దాడులు చేసింది. ఎల్ ఓ సీ వెంట ఉన్న జైషే ఉగ్రవాదుల స్థావరాల పై సర్జికల్ స్ట్రైక్ 2 లో భాగంగా బాంబుల వర్షం కురిపించారు. దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది.

అయితే ఈ దాడులను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించినట్టు సమాచారం. జైషే ఉగ్రవాద స్థావరాల పై యుద్ద విమానాలు బాంబులతో విరుచుకుపడుతున్నప్పుడు మోదీ కంట్రోల్ రూములోనే ఉన్నట్టు తెలిసింది. ఆయన దానిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేశారని సమాచారం. భారత్ ఏ ఒక్కరిని నష్టపోకూడదని ఆయన అధికారులతో అన్నారని తెలుస్తోంది. భారత యుద్ధ విమానాలు తమ పని పూర్తి చేసుకొని సురక్షితంగా భారత భూభాగంలోకి వచ్చిన తర్వాత ఆయన కంట్రోల్ రూం నుంచి బయటికి వెళ్లిపోయారని ఓ ఉన్నతాధికారి ద్వారా తెలుస్తోంది.