డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ !

Russian President Vladimir Putin endorsed PM Modi’s emphasis on terrorism

ఢిల్లీలో డ్రైవర్ రహిత మెట్రో రైలు సేవలు ప్రారంభం అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ఈ సేవలను ప్రారంభించారు. పశ్చిమ జనక్‌పురి-బొటానికల్ గార్డెన్ మధ్య 37 కిలోమీటర్ల పరిధిలో సేవలు అందనున్నాయి. ఇది దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలు కావడం విశేషం.

Driver less train: ఇవాళ దేశపు తొలి డ్రైవర్ రహిత ట్రైన్ ప్రారంభం

వచ్చే ఏడాది జూన్ నాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్‌ లైన్‌లో కూడా ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయి. ఈ రోజు నేషనల్‌ మొబిలిటీ కార్డును కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత్ స్మార్ట్ సిస్టమ్‌లో ఎంతగా ముందుకు వెళుతుందన్న విషయాన్ని డ్రైవర్ లెస్ మెట్రో సేవల ప్రారంభం స్పష్టం చేస్తోందని చెప్పారు.

దేశంలో అటల్ జీ హయాంలోనే మొట్టమొదటి మెట్రో ప్రారంభమైంది. తిరిగి 2014లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేవలం 5 నగరాల్లో మాత్రమే మెట్రో సేవలు ఉండేవి. ఇప్పుడు 18 నగరాల్లో మెట్రో సేవలు అందుతున్నాయి. 2025లోపు దేశంలోని 25 నగరాల్లో మెట్రో సేవలు అందేలా చేస్తాం’ అని చెప్పారు. మానవ తప్పిదాల్ని తగ్గించడమే కాకుండా..మెరుగైన ప్రయాణ సౌకర్యం, రవాణా రంగంలో కొత్త శకం సాధ్యమవుతాయని అధికారులు చెబుతున్నారు.