Home News ఆ సెంటిమెంట్ ప్రకారం మోదీ త్వరలో మాజీ ప్రధాని అవుతాడట : సీఎం సంచలన వ్యాఖ్యలు...

ఆ సెంటిమెంట్ ప్రకారం మోదీ త్వరలో మాజీ ప్రధాని అవుతాడట : సీఎం సంచలన వ్యాఖ్యలు !

రాజకీయ నాయకులు సెంటిమెంట్ ను బాగా ఫాలో అవుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్. రాజకీయాల్లో ఎవరి స్థానం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరం చెప్పలేము. కాబట్టి రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు ఖచ్చితంగా సెంటిమెంట్లకు గౌరవం ఇస్తారు. ఇదిలా ఉంటే .. ఇదే సెంటిమెంట్ ప్రకారం తాజాగా దేశంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న ప్రధాని మోడీ త్వరలో మాజీ కావడం ఖాయమని.. ఆ సెంటిమెంట్ ఖచ్చితంగా రిపీట్ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు అంటే .. చత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ బాఘేల్.

మోదీ త్వరలో మాజీ ప్రధాని అవుతారు: భూపేష్

ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో మాజీ ప్రధాని అవుతారని ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బాఘేల్‌ జోస్యం చెప్పారు. గుజరాత్‌లోని మెతెరా స్టేడియం పేరును ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో మార్పు చేయడంపై ఆయన స్పందించారు. ఇది బీజేపీ సంప్రదాయమని విమర్శించారు. గతంలో అటల్ జీ జీవించి ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో అటల్ చౌక్ పేరు పెట్టారని తెలిపారు. అనంతరం ఆయన మాజీ ప్రధాని అయ్యారని గుర్తు చేశారు.

మోదీ కూడా త్వరలో అటల్‌ జీ లాగే మాజీ ప్రధాని అవుతారనడానికి ఇది ఒక సంకేతమని భూపేష్‌ బాఘేల్‌ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ప్రధానిగా ఉండగానే తన పేరును గుజరాత్ లోని మొతేరా స్టేడియానికి పెట్టిన ప్రధాని నరేంద్రమోడీ కూడా త్వరలోనే అటల్ జీ మాదిరిగానే మాజీ ప్రధాని అవుతారనడానికి ఇది ఒక సంకేతం అని చత్తీస్ ఘడ్ సీఎం బాఘేల్ అంచనా వేశారు.

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

Latest News