మహిళా దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్న “విస్తారా” విమాన సంస్థ

మార్చి 8… అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ప్రైవేటు విమానయాన సంస్థ విస్తారా కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 8 నుంచి విస్తారా విమానాల్లో ప్రయాణించే మహిళల సౌకర్యార్ధం ఉచిత శానిటరీ సదుపాయాన్ని కల్పిస్తామని ప్రకటించింది. విస్తారాకు చెందిన అన్ని దేశీయ సర్వీసులల్లో ఈ సదుపాయం ఉంటుందని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ దీపా చద్దా ప్రకటించారు.

అత్యంత నాణ్యమైన శానిటరీ నాప్ కీన్స్ అందుబాటులో ఉంటాయన్నారు. అవసరం ఉన్న వారు విమాన సిబ్బందిని అడిగి ఉచితంగా వీటిని పొందవచ్చన్నారు. వీటికి సంబంధించి విమానాల్లో అనౌన్స్ మెంటు కూడా ఉంటుందన్నారు.  దీంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి విమానయాన సంస్థగా విస్తారా గుర్తింపు దక్కించుకోనుంది.

మహిళలు, యువతులు పీరియడ్ సమయంలో అనుభవించే సమస్యల పై ప్రజలల్లో ఇప్పుడిప్పుడే సానుకూల అవగాహన వస్తుంది. ఒక్కప్పుడు రుతుస్రావం అంటేనే ఏదో అంటు అన్నట్టు చూసేవారు. అటువంటి మహిళలను కనీసం దగ్గరికి కూడా రానించేవారు కాదు. వారిని అంటరాని వారిగా చూసేవారు. మహిళలకు పీరియడ్స్ అనేవి లేకపోతే అసలు ఈ సృష్టే లేదు. వెనుకటి పనికి మాలిన ఆచారాలతో ఇప్పటి సమాజంలోని కొందరు కూడా వింత పోకడలకు పోతున్నారని మహిళా సంఘం నేతలు అన్నారు. ఇక అటువంటి పనికిమాలిన సంస్కృతికి ఆచారానికి చరమగీతం పాడే సమయం వచ్చిందని పలువురు మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నెలసరి పై పాతకాలపు భావజాలాన్ని సవాల్ చేస్తూ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా ప్యాడ్ మాన్ సినిమా వచ్చి సవాల్ సృష్టించింది. మహిళల సమస్యల పట్ల ఇప్పటికైనా సమాజంలో అవగాహన రావడం ఆనందించదగ్గ పరిణామమని పలువురు సంతోషం వ్యక్తం చేశారు.