సాధారణంగా ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడాలి అంటే ముందుగా అబ్బాయి అందం కాకుండా తన వ్యక్తిత్వం తన అలవాట్లు అమ్మాయికి నచ్చాలి ఇలా అబ్బాయిల వ్యక్తిత్వం అలవాట్లు నచ్చితేనే అబ్బాయిల పట్ల అమ్మాయిలు ఆకర్షితులు అవుతారు. చాలామంది అబ్బాయిలు తమకున్న అలవాట్ల కారణంగా, వాటిని అమ్మాయిల ముందు బహిర్గతం చేయటం వల్ల అమ్మాయిలు వారిని దూరం పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే పొరపాటున కూడా మీలో ఇలాంటి అలవాట్లు కనక ఉంటే వెంటనే మార్చుకోండి లేదంటే మిమ్మల్ని ఏ అమ్మాయి కూడా ఇష్టపడదు.
అబ్బాయిలు అమ్మాయిలతో కలిసి ఏదైనా డేటింగ్ వెళ్లాలన్న లేదా ఎక్కడికైనా వెళ్లాలన్నా ఒక ప్లాన్ వేస్తారు అయితే ఆ ప్లాన్ పదే పదే మారుస్తూ ఉండడం అమ్మాయిలకు ఏమాత్రం నచ్చదు. ఇలాంటి అలవాటు మీకు కనుక ఉంటే వెంటనే ఈ అలవాటు మార్చుకోండి. ఇక అనుచిత ప్రవర్తన కలిగిన అబ్బాయిలు అంటే అమ్మాయిలకు చాలా చిరాకు అందుకే అమ్మాయిల ముందు పొరపాటున కూడా ఇతరుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి అది ఒక హోటల్ వెయిటర్ అయిన వాచ్మెన్ అయిన సరే వారిపట్ల ఎంతో పద్ధతిగా ప్రవర్తించండి.
గర్వంగా ఉండడం అహంకారం చూపించే అబ్బాయిలు అంటే అమ్మాయిలు ఇష్టపడరు అలాంటి వారిని అమ్మాయిలు దూరం పెడతారు అలాగే అతి ప్రేమను చూపించినా కూడా అమ్మాయిలు అలాంటి ప్రేమకు లొంగరు వాళ్లు అబ్బాయిలను దూరం పెడతారు అలాగని వారి పట్ల ఏమాత్రం ప్రేమ చూపకపోయినా వారికి నచ్చదు కనుక వారికి ఎంత ప్రేమను కురిపించాలో అంతే ప్రేమను చూపించాలి. ఇక తల్లి చాటు బిడ్డగా ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకు ఏమాత్రం నచ్చదు.కొన్ని సందర్భాలలో తల్లి మాట వినడం చాలా మంచిది కానీ పెళ్లి తర్వాత కూడా ప్రతి ఒక్క విషయము తల్లి చెప్పినట్టే విని ప్రతి విషయాన్ని కూడా తన తల్లికి చెప్పే అబ్బాయిలు అంటే అమ్మాయిలు ఇష్టపడరు.