సీఎం భార్య ఆస్తుల పై ఐటి దాడులు

సీఎం భార్యకు సంబంధించిన ఆస్తుల పై ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. కర్ణాటకలో గురువారం ఉదయం నుంచి ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ సినీ నటులు, నిర్మాతల ఇళ్లలో ఐటి సోదాలు జరుగుతున్నాయి. ఏక కాలంలో 60 చోట్ల ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత వెంకటేష్, ప్రముఖ సినీ నటి రాధిక ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి.

సినీ నటి రాధిక కర్ణాటక సీఎం రెండో భార్య. రాధిక భర్త కుమారస్వామి ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె ఇంటి పై కూడా అధికారులు దాడులు జరపడం చర్చనీయాంశమైంది. రాధిక పలు వ్యాపారాలు చేస్తుందని ప్రభుత్వానికి పన్ను కట్టలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం కన్నడ సిని ఇండస్ట్రీ పైనే ఐటి దాడులు జరగడం చర్చనీయాంశమైంది.

కూతురితో రాధిక కుమార స్వామి

కేంద్ర ప్రభుత్వం కావాలనే దాడులు నిర్వహిస్తుందని జెడిఎస్ , కన్నడ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. సీఎం ను దైర్యంగా ఎదుర్కోలేక ఆయన భార్య పై దాడులు చేయిస్తున్నారని వారు మండి పడ్డారు. ప్రజాస్వామ్య విలువలను నాశనం చేస్తున్నారన్నారు. నటి రాధిక అన్ని చెల్లింపులు చేశారని   ఈ కేసులో క్లీన్ చిట్ గా ఆమె బయటపడుతుందన్నారు. ఐటి దాడులు జరుగుతుండడంతో కాంగ్రెస్, జెడిఎస్ నాయకులు బెంగుళూరులో ఆందోళన నిర్వహించారు.