ఆరు నెలల తర్వాత తొలిసారి వంట గ్యాస్ ధర తగ్గింది. ఎన్నికల ముందు కొంత కుటుంబ ఖర్చు తగ్గించాలనుకుంటున్నట్లుంది సబ్బిడీ సిలింండర్ ధరను రు. 6.52 పైసలు తగ్గించారు. ఆయిల్ ధరల వల్ల టాక్స్ లో వచ్చే వ్యత్యాసాల కారణంగా సిలిండర్ ధర తగ్గింది. జూన్ తర్వాత నెలనెలా పెరగడమే తప్ప తగ్గడం లేని వంటగ్యాస్ ధర ఇపుడు తగ్గడం చాలా పెద్ద వార్త గా చెప్పుకోవాలి. 14.2 కెజీల సబ్సిడి సిలిండర్ ధరను రు.507.42 పైసల నుంచి రు.500.90 పైసలుకు తగ్గించారు. చివరి సారి నవంబర్ ఒకటో తేదీన సిలిండర్ మీద రు. 2.94 పైసల భారం పెరిగింది.
ఇక సబ్సిడీ లేని సిలిండర్ ధర మాత్రం భారీ తగ్గింది. ఈ సిలిండర్ రు. 133 తగ్గడం రికార్డు అని చెప్పుకోవచ్చు. సబ్సిడీ లేని సిలిండర్ ధర ఇపుడు ఢిల్లీలో రు. 809.50 పైసలుగా ఉంటుంది. ఇది ఈ రోజు అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తుంది.
ప్రతికుటుంబానికి ఇపుడు ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీధరలకు అందిస్తున్నారు. ఆపైన మార్కెట్ రేటు కు కొనాల్సిందే.