వంట గ్యాస్ త్వరగా అయిపోతుందా… ఈ చిట్కాలతో గ్యాస్ ఆదా చేయండి!

ప్రస్తుతం వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి వంట గ్యాస్ ఉపయోగించడం సామాన్యులకు భారంగా మారిపోయింది. అయితే వంట చెరుకు దొరకడం కూడా కష్టతరం కారణంగా నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ ఉపయోగించి వంట తయారు చేసుకుంటున్నారు అయితే చాలామందికి వంటగ్యాస్ చాలా తక్కువ సమయానికే పూర్తి కావడంతో గ్యాస్ కొనలేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ విధంగా వంట గ్యాస్ త్వరగా అయిపోకుండా ఉండాలంటే వంట చేసేటప్పుడు ఈ చిన్న చిట్కాలను పాటిస్తే చాలు.

వంట చేసే సమయంలో తప్పనిసరిగా మనం వంట చేసే పాత్ర పై మూత పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు చాలా తక్కువ సమయానికి కూరలు ఉడికిపోతాయి తద్వారా మనకు గ్యాస్ ఆదా అవుతుంది. ఇకపోతే పాలు ఒకసారి కాల్చి వాటిని క్లాసుకులో తీసిపెట్టాలి ఇలా చేసినప్పుడు మాటిమాటికి పాలు వేడి చేయకుండా ఉంటారు తద్వారా గ్యాస్ మనం ఆదా చేయవచ్చు.ఇక కూరలు చేసేటప్పుడు ఒకేసారి కూరకు సరిపడా నీటిని వేసి మనం కూరను ఉడికించుకోవాలి అలా కాకుండా మాటిమాటికి నీళ్లను వేస్తూ ఉడికించుకోవడం వల్ల ఆ నీరు వేడవడానికి మరింత సమయం పడుతుంది.

ఇలా మీరు మాటిమాటికీ పోయడం వల్ల గ్యాస్ చాలా త్వరగా అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి.ఇక తొందరగా వంటలు కావాలని ఎప్పుడూ కూడా ఎక్కువ మంటపై వంటలు చేయకూడదు ఇలా చేయడం వల్ల ఆహారంలో ఉన్నటువంటి పోషకాలు వెళ్లిపోవడమే కాకుండా గ్యాస్ కూడా తొందరగా అయిపోతుంది అందుకే చిన్న మంటపై కూరలు చేసుకోవడం ఎంతో మంచిది.ఇక వంట అయిపోయిన తర్వాత గ్యాస్ సిలిండర్ దగ్గర ముందుగా ఆఫ్ చేయాలి అలా ఆఫ్ చేయడం వల్ల ఆ పైప్ లో ఉన్నటువంటి గ్యాస్ మొత్తం పూర్తి అయ్యి ఎక్కడ గ్యాస్ వృధా కాదు. ఇక గ్యాస్ అయిపోయే ముందు ఎర్రగా మండుతూ ఉంటుంది. అప్పుడు గ్యాస్ సిలిండర్ ను కాస్త వేడి నీటి గిన్నెలో పెట్టడం వల్ల మరి కొంత సమయం పాటు గ్యాస్ వెలిగే అవకాశాలు ఉంటాయి ఈ చిట్కాల ద్వారా గ్యాస్ ను ఆదా చేయవచ్చు.