తండ్రిని పరామర్శించేందుకు వెళ్లి పాక్ లో చిక్కుకున్న మహిళ

పాక్ లో ఉన్న తన తండ్రిని పరామర్శించేందుకు వెళ్లిన ఓ మహిళ పాక్ లో చిక్కుకు పోయింది. ఇండియాకు రాలేక ఇబ్బంది పడుతోంది. దీంతో ఎంబీటి అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్ ట్విట్లర్ లో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ శాలిబండకు చెందిన షేక్ ఇజాజ్ కు పాకిస్థాన్ కు చెందిన మహిళ సుమేరా ఫారూఖీతో 2011లో వివాహం జరిగింది. పాకిస్థాన్ లో అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని చూడడానికి డిసెంబర్ 4 , 2018 న 90 రోజుల వీసా అనుమతితో పాక్ వెళ్లింది.

ఆమె వీసా గడువు మార్చి 3 వరకే ఉంది. దాంతో ఫిబ్రవరి 27న దుబాయ్ మీదుగా ఢిల్లీ వచ్చే విమానం టికెట్లు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతతలతో ఆమె లాహోర్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆమె తిరిగి వచ్చేందుకు విదేశాంగ శాఖ అధికారులు సహకరించాలని వారు కోరారు.