ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.లక్ష వేతనంతో?

ప్రస్తుత కాలంలో దేశంలో చాలామంది కనీసం ఇంటర్ చదువుతున్నారు. అయితే ఇంటర్ అర్హతతో కూడా నెలకు లక్ష రూపాయల వేతనం సంపాదించే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ఇంటర్ అర్హతతో నావీ ఉద్యోగాలను చేయవచ్చు. ఇంటర్ లో ఎంపీసీ గ్రూప్ చదివి 2004 సంవత్సరం నుంచి 2006 సంవత్సరం జులై మధ్యలో జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కనీసం 157 సెంటిమీటర్ల ఎత్తు, ఎత్తుకు తగిన బరువు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. అయితే ఈ ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే కచ్చితంగా జేఈఈ మెయిన్ లో ర్యాంకు సాధించి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రెండు దశలలో ఇంటర్వ్యూ జరుగుతుంది.

ఎస్‌ఎస్‌బీలో వచ్చిన మెరిట్ కు అనుగుణంగా అర్హులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అవకాశం కలుగుతుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన నియమనిబంధనలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొదటి దశలో ఎంపికైన వాళ్లను మాత్రమే రెండో దశకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు చేరిన వాళ్లకు 60 వార్షిక సెలవులతో పాటు 20 సాధారణ సెలవులు ఉంటాయి.

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు ఈ ఏడాది జూన్ నెల నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. అర్హత ఉన్న విద్యార్థులు వేతనం తీసుకుంటూ బీటెక్ పూర్తి చేయవచ్చు. ఇంటర్ ను పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తే కెరీర్ బాగుంటుందని చెప్పవచ్చు.