తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని వర్గాల ప్రజలను మెప్పించే విధంగా ఉన్నాయి. ఇంటర్ పాస్ అయిన మహిళలను మీసేవ ఆపరేటర్లుగా ఎంపిక చేసేలా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆగష్టు నెల 15వ తేదీలోగా మహిళలను మీసేవ ఆపరేటర్లుగా ఎంపిక చేయనున్నారని సమాచారం అందుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం మీ సేవా కేంద్రాలను స్వయం సహాయక కేంద్రాలకు కేటాయించనుండటం కొసమెరుపు. మీసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించే వాళ్లకు రుణం రూపంలో ఆర్థిక సాయం అందనుందని సమాచారం అందుతోంది. ఇందుకోసం మహిళలపై భారం పడకుండా ప్రభుత్వం 2.5 లక్షల రూపాయల రుణం ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేయనున్నారు.
ఇంటర్ పాసైన మహిళలకు నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి మీ సేవా కేంద్రాలను వాళ్ల చేత ఓపెన్ చేయించనున్నారు. ఇంటినుంచి ఉపాధి అవకాశాలు కోరుకునే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. మరికొన్ని రోజుల్లో మహిళలు ఈ స్కీమ్స్ కు సంబంధించిన బెనిఫిట్స్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాల, ఇతర భవనాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనుండటం కొసమెరుపు. కొత్తగా మీసేవా కేంద్రాలు అందుబాటులోకి వస్తే ప్రభుత్వ సేవలు ఇంటి వద్దకే వచ్చినట్లు అవుతుందని చెప్పవచ్చు. రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తుండటం గమనార్హం.