న్యూజిలాండ్ వన్డే సిరిస్ ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు

పురుషుల క్రికెట్ బాటలోనే మహిళల క్రికెట్ సరికొత్త రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్ లో 2-0 ఆధిక్యంతో భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరిస్ భారత్ వశమైంది.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు 161 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లలో సాటెర్తు వేట్ 71 పరుగులు చేసి టాప్ స్కోర్ గా నిలిచింది. అంతకుముందు టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించి కివీస్‌ను 161 పరుగులకే కట్టడి చేశారు. పేస్ బౌలర్ ఝులన్ గోస్వామి మూడు వికెట్లు తీయగా.. ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు తీశారు.

162 పరుగుల లక్ష్యంతో మిథాలీ సేన బరిలోకి దిగింది. తొలి వన్డేలో సెంచరీ చేసిన స్మృతి ఈ వన్డేలో 90 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీతో చెలరేగింది. దీంతో ఇంకా 14.4 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో భారత్ 162 పరుగుల లక్ష్యాన్ని చేరుకొని విజయం సాధించింది. న్యూజిలాండ్ లో వన్డే సిరీస్ గెలుచుకొని పురుషుల జట్టు దూకుడు ప్రదర్శించినట్టుగానే మహిళల జట్టు విజయ దుందుంభి మోగించింది. దీంతో సిరీస్ భారత్ వశమైంది.