మూడో వన్డేలో కివీస్ పై టీమిండియా ఘన విజయం, వన్డే సిరీస్ కైవసం

టీమిండియా మరో సారి చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 5 వన్డేల సిరీస్ 3-0తో భారత్ వశమైంది.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 49 ఓవర్లలో 243 పరుగులు చేసి ఆలౌటయ్యింది. భారత్ 43 ఓవర్లలో 245 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.

భారత బౌలర్ల దెబ్బకు కివీస్ బ్యాట్స్ మన్ మరోసారి కుప్పకూలిపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత బ్యాట్స్ మెన్స్ కివీస్ ను  ఓ ఆట ఆడుకున్నారు. పిచ్ లో నిలదొక్కుకుని భారత్ ను విజయం ముంగిట నిలిపారు. భారత బ్యాట్స్ మెన్లలో ఆర్జీ శర్మ 62, శిఖర్ ధావన్ 28, కోహ్లీ 60, రాయుడు 40 , కార్తీక్ 38 , పరుగులు చేశారు. కివీస్ బౌలర్లు బోల్ట్ కి 2, శాంతర్ కి ఒక వికెట్ దక్కాయి.

కివీస్ బ్యాట్స్ మెన్స్ రాస్ టేలర్ 93, లాథమ్ 51, విలియమ్సన్ 28, గఫ్టీల్ 13 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్లు సాధించగా, హార్దిక్‌ పాండ్యా, చహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. మూడు వన్డేలు వరుసగా గెలవడంతో భారత్ 5 వన్డేల సిరీస్ కైవసం చేసుకుంది. ఇక సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం పై భారత ఆటగాళ్లు కన్నేశారు.