Corona Cases: గుడ్‌న్యూస్ తగ్గుతున్న కరోనా కేసులు..

దేశంలో కరోనా  కేసులు భారీగా తగ్గాయి. రోజువారి కేసుల సంఖ్య 20 వేలకు దిగువన నమోదవుతున్నాయి.గడిచిన 24 గంటల్లో 14,148 కరోనా కేసులు నమోదు కాగా… 255 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రోజువారి పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,21,881 (0.28%)గా ఉంది. దేశంలో మెుత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,05,844గా  నమోదు కాగా… ఇప్పటివరకు కరోనాతో 5,13,481 మంది ప్రాణాలు కోల్పోయారు.