భారత్, పాక్ ల మధ్య యుద్ధం వస్తే… ఎవరి సత్తా ఎంత అంటే

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ కు భారత ఎయిర్ ఫోర్స్ గట్టి బుద్ది చెప్పింది. అదే విధంగా అంతర్జాతీయ వేదికల మీద పాక్ ను ఒంటరి చేసేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేసింది. పాక్ చైనాను సంప్రదించినా చైైనా ఈ సమయంలో సాయం చేయలేమని ముఖం మీదే చెప్పింది. అమెరికా ముందు నుంచి భారత్ కు మద్దతుగా నిలిచింది.

తాజాగా బుధవారం పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడడంతో అక్కడి బలగాలను పాక్ ను తిప్పికొట్టాయి. దీంతో సరిహద్దులో యుద్ద వాతావరణం నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోన్న ఆందోళన అందరిలో నెలకొంది. దీంతో భారత్ పాక్ మధ్య యుధ్దమేఘాలు కమ్ముకున్నాయి. ఒక వేళ యుద్దమే కనుక వస్తే ఎవరి సత్తా ఎంత అనేది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశమైంది. పాక్ ఇప్పటికే సివిల్ సైరన్ ను మోగించింది. భారత సైన్యం, పాక్ సైన్యం వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా భారత్, ఆ తర్వాత పాక్ ఆర్మీ వివరాలు ఉన్నాయి. 

సైన్యం 14,00,000  6,53,800
క్షిపణులు అగ్ని–3 సహా 9 రకాలు షహీన్‌–2సహా 2 రకాలు 
అణు బాంబులు 130-140 140-150
యుద్ధ ట్యాంకులు 3,565 2,496
యుద్ధ విమానాలు 814 425
విమాన వాహక నౌకలు 1 0
జలాంతర్గాములు 16