కరోనా మహమ్మారి జోరు ప్రపంచ వ్యాప్తంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది ప్రారంభించారు. అయితే , పూర్తి స్థాయిలో కరోనా వ్యాక్సిన్ అందరికి అందుబాటులోకి రావాలి అంటే మరింత సమయం పట్టే అవకాశం అయితే ఉంది.
ఇకపోతే , భారత్ లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గతంతో పోల్చితే తక్కువగానే నమోదు అవుతున్నప్పటికీ కూడా కరోనా కేసులు మాత్రం భారీగానే నమోదు అవుతున్నాయి. ఇండియాలో నిన్న కొత్తగా 27,071 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 98,84,100కి చేరింది. నిన్న కొత్తగా 336 మంది కరోనా వల్ల చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,43,355కి చేరింది.
ఇండియాలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. నిన్న ఇండియాలో కొత్తగా 30,695 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 93,88,159కి చేరింది. దేశంలో రికవరీ రేటు 95 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల రికవరీ రేటు 70 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 3,52,586 ఉన్నాయి.ఇండియాలో వీకెండ్‌లో టెస్టుల సంఖ్య తగ్గిపోతోంది. నిన్న దేశంమంతా కలిపి 8,55,157 టెస్టులే జరిగాయి. మొన్నటి కంటే అవి 1,59,277 తక్కువ ఉన్నాయి. మొత్తం టెస్టుల సంఖ్య 15,45,66,990కి చేరింది