పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ప్రపంచం అంతా నిద్రపోతున్న సమయంలో 21 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టు బెట్టింది. భారత వాయుసేన ఏం చేస్తుందో పాక్ అర్థం చేసుకునేలోపే ఆపరేషన్ ముగించారు. దీంతో ఉగ్రవాదులకు గట్టి దెబ్బ తగిలింది.
భారత వాయుసేన మిరాజ్ యుద్ధ విమానాలను వాడింది. మిరాజ్ విమానాలు మిగిలిన వాటితో పోలిస్తే బరువు తక్కువగా ఉంటాయి. దీని ఇంజన్ అత్యంత శక్తివంతమైంది. కేవలం 7500 కిలోల బరువుంటే విమానం దాదాపు 9.5 టన్నుల బరువును తనతోపాటు తీసుకెళ్లగలదు. ఇది శబ్ధవేగానికి 2.2 రెట్ల వేగంతో దూసుకెళుతుంది. గంటకు 2336 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
సుఖోయ్ విమానం అత్యధిక వేగం గంటకు 2120 కిలోమీటర్లు మాత్రమే. భూమికి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే సత్తా దీనికి ఉంది. అతి తక్కువ ఎత్తులో అత్యధిక వేగంతో కూడా ప్రయాణించగలదు. లేజర్ గైడెడ్ బాంబులను మిరాజ్ ప్రయోగించగలదు. రాడార్లలో దీనిని గుర్తించడం శత్రుశిబిరానికి కష్టమే.
కొన్ని నిమిషాల్లో పూర్తి చేసే ఆపరేషన్లకు మిరాజ్ తోడ్పడుతుంది. అందుకే పాక్ పై చేసిన దాడుల్లో కూడా కేవలం 21 నిమిషాల్లోనే వాయుసేన తన ఆపరేషన్ ను పూర్తి చేసింది.