మద్యం ప్రియులకు షాక్ తగలనుంది. రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా బార్లీ సరఫరాలపై ప్రభావం పడడంతో బీర్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. రష్యా ప్రపంచంలో రెండవ అతిపెద్ద బార్లీ ఉత్పత్తి చేసే దేశంగా ఉంది. ఇక ఉక్రెయిన్ ప్రపంచవ్యాప్తంగా మాల్ట్‌ను సరఫరా చేసే నాల్గవ అతిపెద్ద దేశం . యుద్ధ కారణంగా ఆ దేశం దిగుమతులు అగిపోయాయి. దీంతో బార్లీ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. బార్లీ ధరలు పెరగడం వల్ల దేశీయంగా వాటి అధారంగా ఉత్పత్తి చేసే వాటిపై ప్రభావం పడుతుంది. ఇక రష్యా-ఉక్రెయిన్ వివాదంతో యుఎస్, కెనడాతో సహా ఇతర దేశాల్లో రష్యా తయారి స్పిరిట్‌లను బహిష్కరించడంతో వోడ్కా ధరలు కూడా భారీగా పెరగనున్నాయి.