కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా ఆ పథకాలు రైతులకు ఎంతగానో ప్రయోజనం కలిగిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అవగాహనను కలిగి ఉంటే సులువుగా లక్షల రూపాయల ఆదాయం మన సొంతమవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పీఎం కుసుమ్ యోజన పేరుతో అమలు చేస్తున్న స్కీమ్ వల్ల రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో బెనిఫిట్ పొందుతున్నారు.
2019 సంవత్సరంలో ఈ స్కీమ్ మొదలు కాగా 25 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ ద్వారా సులువుగా ఆదాయం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో చేరిన రైతులు సోలార్ పంపులను ఏర్పాటు చేసుకుని సోలార్ ఎనర్జీతో పంటలను సాగు చేసుకోవచ్చు. సబ్సిడీ ధరకే సోలార్ ప్యానెల్స్ ను పొందే అవకాశం ఉండగా ఈ ప్యానెల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసి ఎక్కువమొత్తం ఆదాయం అయితే సులువుగా పొందవచ్చు.
ఈ స్కీమ్ ద్వారా కరెంట్ వినియోగాన్ని తగ్గించి పంటలను సాగు చేసే అవకాశం అయితే ఉంటుంది. సబ్ స్టేషన్ కు 5 కిలోమీటర్ల దూరంలో పొలాలు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్యానెల్స్ ద్వారా వచ్చిన కరెంట్ ను పొలాలకు వాడుకోవడంతో పాటు మిగతా కరెంట్ ను అమ్ముకోవచ్చు. ఈ విధంగా సులువుగా ఎకరాకు లక్ష రూపాయల రేంజ్ లో ఆదాయం పొందవచ్చు.
ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు 60 శాతం రాయితీ పొందడంతో పాటు 30 శాతాన్ని లోన్ రూపంలో పొందవచ్చు. https://www.india.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మేలు జరుగుతుంది.